ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (మంగళగిరి)మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నందు గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ , మాజీ ఎంపీ, పోలిట్ బ్యూరో మెంబర్ కంభంపాటి రామ్మోహన రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా బాధితుల వివరాలు వారి సమస్యలు అడిగి తెలుసుకొని కొన్నింటికి అధికారుల ద్వారా పరిష్కారం చూపించడం జరిగింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే రాష్ట్రం లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, ప్రతి నెల పెన్షన్ ను ఒకటవ తేదీ కి కొన్నిసార్లు ఒకటవ తేదీకి ముందుగానే లబ్దిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ని సమన్వయంగా అందిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మన్నెనలను పొందుతుందని అన్నారు. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వారి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *