తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులుగా బొల్లాడ నాగరాజు….

లీడర్ న్యూస్ (తణుకు) తణుకు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ అధ్యక్షులు పెద్దమల్లు అవినాష్ కాంత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ ఎన్నికలకు జిల్లా కన్వీనర్, ఎన్నికల పరిశీలకులు పేరిచర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, టౌన్ ఎన్నికల అధికారి సింహాద్రి లక్ష్మణ కుమార్ గుప్తా ల పర్యవేక్షణలో నిర్వహించిన సమావేశ కార్యక్రమం లో బొల్లాడ నాగరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఎన్నికల పరిశీలకులు పేరిచర్ల సుభాష్ రాజు మాట్లాడుతూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న బొల్లాడ నాగరాజు పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బొల్లాడ నాగరాజును తణుకు పట్టణ బిజెపి నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సోమ సుందర సూర్యనారాయణ రాజు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కామర్సు ధనలక్ష్మి కిరణ్మయి, తణుకు పట్టణ ఉపాధ్యక్షులు రాసాబత్తుల అను కుమార్, యువ మోర్చ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, కె.శివప్రసాద్( అన్నదాత ) యువమోర్చ నాయకులు బడేటి సాయిరాం, మారిశెట్టి అజయ్, బిజెపి నాయకులు మంగరాతి నాగేశ్వరరావు,పై బోయిన సత్యనారాయణ, ఆత్మూరి రామకృష్ణ కొత్తపల్లి క్రాంతి తేజ, యగ్గేపల్లి రవికుమార్ పట్టణ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *