లీడర్ న్యూస్ (మంగళగిరి)మంగళగిరి CCLA కార్యాలయంలో రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ లో అధికారులతో కలిసి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా PGRSలో వచ్చిన అర్జీల పరిష్కారం, ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన, 22 ఏ భూముల అక్రమాలు,ఇతర రెవెన్యూ, భూ సంబంధ సమస్యలు తదితర అంశాలపై చర్చించడం జరిగినట్లు తెలియజేశారు.