తణుకు, అత్తిలి జూనియర్ ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం…

లీడర్ న్యూస్ (తణుకు)తణుకు SNVT జూనియర్ ప్రభుత్వ కళాశాల,తణుకు SCIM జూనియర్ ప్రభుత్వ కళాశాల, అత్తిలి S V S S జూనియర్ ప్రభుత్వ కళాశాల లో స్థాలు ఆరిమిల్లి రాధాకృష్ణ  ఆదేశాల మేరకు కూటమి నాయకులు  డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. తణుకు SNVT జూనియర్ ప్రభుత్వ కళాశాలలో తణుకు మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణరావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తోంది అని అన్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని చంద్రబాబు సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తోంది “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” పథకం కింద ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు భోజనం అందిస్తోంది అని అన్నారు. అయితే ఈ పథకం అమలును విస్తృతం చేసేందుకు చంద్రబాబు సర్కార్ తీర్మానం చేసింది. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించి, శనివారం ప్రారంభిస్తుందని తెలియజేశారు.సాధారణంగా ఇంటర్ కళాశాలలు మండల కేంద్రాలు, పట్టణాల్లో ఉంటాయి. అప్పటి వరకూ గ్రామాల్లో చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఆర్థిక సమస్యలు, పేదరికం కారణంగా పదో తరగతి తర్వాత చిన్నచిన్న పనుల్లో చేరిపోయి కుటుంబానికి అండగా ఉందామని భావిస్తుంటారు. అలాంటి వారిని చదువు వైపు పోత్సహించేందుకు 2014-19 మధ్య ఇంటర్ విద్యార్థులకు సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి ఆ పథకాన్ని రద్దు చేసింది. అమ్మకు వదనం కింద వారికి నగదు చెల్లిస్తున్నామని, అందుకే పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అనేక మంది పేద విద్యార్థులు మళ్లీ చదువుకు దూరం అయ్యారు అని అన్నారు. అనంతరం తణుకు పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ  మాట్లాడుతూ ఈ విషయంపై 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు నారా లోకేశ్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు అని అన్నారు. తల్లిదండ్రులు ఉదయానే లేచి తమకు భోజనం అందించడం కష్టంగా మారిందని, కొన్నిసార్లు భోజనం అందక బస్ మిస్ అయ్యే వాళ్లమని వివరించారు. ఆటోలకు వెళ్లాలంటే డబ్బులు ఉండేవి కాదని, ఆర్టీసీ బస్సులో బస్ పాస్ ద్వారా రోజూ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం అందిస్తే తమకు చాలా ఉపయోగంగా ఉంటుందని విద్యార్థులు చెప్పుకోచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *