లీడర్ న్యూస్ (తణుకు)భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలనే లక్ష్యంతోనే సంక్రాతి సంబరాలు నిర్వహించడం జరిగిందని రాష్త్ర బి.సి.మహిళా నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు. సంక్రాతి సంబరాల్లో భాగంగా బాణాసంచా, గంగిరెద్దుల విన్యాసాలు, బోగి మంటలు, విచిత్ర వేషధారణలు, గాలి పటాలు, గోబ్సిపాటలు, మెహందీ, సాంప్రదాయ, వస్త్రధారణ,వంటలు,ముగ్గుల పోటీలు మొదలగు కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరిగాయి. అనంతరం కాలేజీగ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలలో మనం ఆచరించే ప్రతికార్యక్రమాన్ని సాంప్రదాయ వస్త్రధారణ, వంటలు, ముగ్గుల పోటీలు, గాలి పటాలు, మెహాందీ చిన్నారులచే విచిత్ర వేషధారణ వంటి అనేకపోటీలు విద్యార్థులచే నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఇంపల్స్ కాలేజి ప్రిన్సిపల్ కె.ఎన్. వి.రామ్ కుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థులచే చక్కని కార్యక్రమాలు నిర్వహించి సహకారం అందించారు.ఈ సందర్బంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు 18 సంవత్సరాల నుండి చేస్తున్నామని సంస్కృతి సాంప్రదాయాలు నేటియువతరానికి అందించాలని ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయటం ద్వారా వారికి మనం సాంప్రదాయాన్ని తెలిపి భవిష్యత్ తరాలకు చేరవేసిన వారమవుతామని, సంస్కృతి అంటే సైన్స్ అని, సైన్స్ అంటే ఆరోగ్యం అని నేటితరానికి అందచేయటం పెద్దలుగా మన కర్తవ్యం అని అన్నారు.అనంతరం సరళాదేవి ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ కుమార్ దంపతులకు సన్మానం చేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులైన సిఐ, కమీషనర్, ఇంపల్స్ కాలేజి యాజమాన్యం సరళాదేవి దంపతులకు అభినందనలు తెలియజేశారు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలి- వావిలాల సరళాదేవి
10
Jan