లీడర్ న్యూస్ (తణుకు) 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సమరయోధులను వారందరినీ స్మరించుకుంటూ, రాజ్యాంగాన్ని యొక్క స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం స్ఫూర్తిని కాపాడుకుంటూ అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందించడం అనేదే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం అన్నారు.
ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
26
Jan