లీడర్ న్యూస్ (పాలకొల్లు)పాలకొల్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఆచంట మండలం, పోడూరు మండలాలకు సంబంధించి రెండు కల్లు గీత కులాల మద్యం షాపులు ప్రభుత్వం కేటాయించినట్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ తెలియజేశారు.ఆచంట మండల పరిధిలో 1 షాపు, పోడూరు మండలం పరిధిలో 1 షాపు ఏర్పాటు చేసుకోవడానికి శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన వారికి రిజర్వేషన్ గా ప్రభుత్వ జీవోలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రక్రియలో సమర్పించవచ్చని, వచ్చే నెల అనగా ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు సమర్పణ ప్రక్రియకు గడువు ఉందన్నారు. 6వ తేదీ వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేసి, 7వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహిస్తారని తెలిపారు. ఇందుకోసం బిసీ శెట్టిబలిజ కుల ధ్రువీకరణ పత్రము, పశ్చిమ గోదావరి జిల్లా స్థానికత ధ్రువీకరణ పత్రముతో ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు.
పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీత కులాలకు షాపుల కేటాయింపు…
30
Jan