లీడర్ న్యూస్ (తణుకు) సుచిరిండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడిన సర్.సి.వి.రామన్ స్టేట్ లెవల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్లో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లలితకళా తోరణం ఆడిటోరియంలో 16.02.25 (ఆదివారం) జరిగిన సర్.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ నైట్ సుచిరిండియా ఎమ్.డి అండ్ సి.ఇ.వో వై.కిరణ్, తెలంగాణ వ్యవసాయశాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ప్రముఖ చలనచిత్ర నటుడు రావు రమేష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రూట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠిని గురుబ్రహ్మ (బెస్ట్ టీచర్) అవార్డుతో సత్కరించారు.
దీనిలో భాగంగా రాష్ట్రస్థాయిలో 4వ తరగతికి చెందిన ఉత్కర్ష త్రిపాఠి మొదటి ర్యాంకు, జిల్లాస్థాయిలో 6వ తరగతికి చెందిన ఎల్.శ్రావణి మరియు 9వ తరగతికి చెందిన బి.వేణుగోపాల్ మొదటి ర్యాంకులు, , 8వ తరగతికి చెందిన పి.తపస్వి మరియు 7వ తరగతికి చెందిన జి.శ్యామసుందర్ రెండవర్యాంకులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్యఅతిధుల చేతుల మీదుగా గోల్డ్ మెడల్, మెమెంటో, సర్టిఫికెట్స్, రూ.5000/- నగదు బహుమతులు అందచేసారు.
ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మరియు గురుబ్రహ్మ అవార్డు గ్రహీత అయిన సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి కి పాఠశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ ఎన్.సుధాకర్ వర్మ, బి. విద్యాకాంత్, ప్రైమరీ ప్రిన్సిపాల్ టి. సంధ్య, పురబి త్రిపాఠి, డి.పద్మజ, వి.శ్రీలత, ఎన్.మాణిక్య మాధురి, షేక్ సల్మా, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలియజేసారు.
18
Feb