లీడర్ న్యూస్ (తణుకు) మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గోసంరక్షణ సమితి సభ్యులు ఆదివారం కలిశారు.తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో లెహ్యం ఫుడ్స్ ప్రొడక్ట్ (పశువధ) పరిశ్రమ చట్ట వ్యతిరేకంగా నిర్మాణం చేసి, చట్ట వ్యతిరేకంగా గొడ్డు మాంసం కోసం మంచి పశువులను వధ చేస్తున్నారని, ఆ ఫ్యాక్టరీ పై జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ కి వివరించారు.ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు మద్దతు తెలియజేశారని గో సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు.
లెహ్యం పుడ్ ప్రొడక్ట్ పై పవన్ కళ్యాణ్ కి పిర్యాదు..
24
Feb