ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ఏకపక్షం కావాలి – మంత్రి నిమ్మల రామానాయుడు

లీడర్ న్యూస్ (పాలకొల్లు) ప్రజా సేవ చెయడంలో పది నిమిషాలు కూడా విశ్రాంతి కూడా తీసుకోకుండా ప్రజలు కోసం పనిచేస్తున్నానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు . పాలకొల్లు లైన్స్ కమ్యూనిటీ హాల్లో ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపును కోరుతూ జరిగిన పాలకొల్లు నియోజకవర్గస్థాయి కూటమి ముఖ్య నాయకుల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ గెలుపు ఏకపక్షం కావాలని అందుకు ఆయనకు ప్రథమ ప్రాధాన్యతో ఓటు వెయ్యాలని పట్టభద్రులను కలిసి కోరాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడిచిన 8 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, జరగబోయే స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు గెలుపు ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర శాసనసభ తో పాటు శాసనమండలిలోనూ కూటమి మెజార్టీగా ఉండాలంటే ఎమ్మెల్సీ గెలుపు చారిత్రాత్మక అవసరం అన్నారు. ప్రతి ఒక్కరు బూత్ స్థాయి నుంచి బాధ్యత తీసుకోవాలని మంత్రి రామానాయుడు పిలుపునిచ్చారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చానని, ఏ నియోజకవర్గంలోనూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలకు సేవ చేయడంలో మంత్రిగా కాకుండా సేవకుడిగానే పని చేస్తున్నానని వైద్య పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున సాయం అందించామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *