గోల్డెన్ కిడ్స్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ బి.ఉమకి ప్రతిష్టాత్మకమైన బ్రెయిన్‌ఫీడ్ ఎక్సెంప్లరీ ఉమాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవార్డు…

లీడర్ న్యూస్ (తణుకు) విద్యారంగంపై చేసిన విశేష కృషికి గాను తణుకు పట్టణంలో ఉన్న గోల్డెన్ కిడ్స్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ బి.ఉమకి ప్రతిష్టాత్మకమైన బ్రెయిన్‌ఫీడ్ ఎక్సెంప్లరీ ఉమాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవార్డు – 2025 తో సత్కరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ కల్చరల్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ గౌరవనీయమైన గుర్తింపు లభించింది. విద్యారంగంలో ఆమె చేసిన వినూత్న ఆలోచనలు, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి నిబద్ధతను ప్రదర్శించినందుకు గాను ఉమను సత్కరించారు. ఈ విజయం నాణ్యమైన విద్యను అందించడంలో ఆమె అంకిత భావం మరియు అభిరుచికి నిదర్శనం మరియు గోల్డెన్ కిడ్స్ స్కూల్ ఆమె నాయకత్వంలో ఉండటం గర్వంగా ఉందని పలువురు అధ్యాపకులు తెలిపారు.ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధతో పాటు, సాంస్కృతిక మరియు సాంప్రదాయ కార్యక్రమాలు కూడా చేస్తూ విలువలు తో కూడిన విద్యను అందిస్తున్న ఉమకి ఈ అవార్డు తో సత్కరించడం మనకు అభినందనీయమని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *