లీడర్ న్యూస్ (తణుకు) వైఎస్సార్‌సీపీ తణుకు పట్టణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకులు మారిశెట్టి శేషగిరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా శేషగిరి పేరును పార్టీ జిల్లా సెక్రటరీ ఆర్గనైజేషన్ యిండుగపల్లి బలరామకృష్ణ, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ మారిశెట్టి శంకరం, పట్టణ మాజీ అధ్యక్షుడు మంగెన సూర్య బలపరచగా పార్టీ శ్రేణులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కారుమూరి ఫోన్‌లో శేషగిరిని అభినందించారు. పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పార్టీ శ్రేణుల్లో అన్ని వర్గాల వారితో మమేకమై పనిచేయాలని సూచించారు. పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మారిశెట్టి శేషగిరి మాట్లాడుతూ మాజీమంత్రి కారుమూరి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా ఏకగ్రీవంగా తనకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని, తనపై ఉంచిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిలబెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్‌సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్, ఎంపీపీ రుద్రా ధనరాజు, తణుకు మండల అధ్యక్షులు పెనుమర్తి వెంకటరామన్న, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, వడ్లూరి సీతారాం, ఉండవల్లి జానకి, కొత్తపల్లి చరణ్, ఫణీంద్రకుమార్ వీరమల్లు, ఝాన్సీ లారెన్స్, చింతలపూడి సూర్యనారాయణ, చంద్రశేఖర్, బుడితి సుజన్‌కుమార్, కంకటాల సతీష్, చింతాడ సంజీవరావు, కొమ్మోజు రామకృష్ణ, కర్రి గంగాధర అప్పారావు, వై.రామకృష్ణ, షేక్ జిలాని, రంభ నాగేశ్వరరావు, రేలంగి రాంబాబు, గారపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.
వైసీపి పట్టణ అధ్యక్షుడిగా మారిశెట్టి శేషగిరి.. మాజీమంత్రి కారుమూరి ఆదేశాలతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ శ్రేణులు….
02
Mar