తణుకులో ఎగ్ & చికెన్ మేళా… హాజరైన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ న్యూస్ (తణుకు)తణుకు నెక్ కళ్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎగ్ & చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని చికెన్ & ఎగ్ తింటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చికెన్ & ఎగ్ పై పెట్టిన నిబంధనలు తీసివేయడం జరిగిందని, వీటిని వినియోగించుకోవడంలో ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరు ఎగ్ & చికెన్ తినడానికి బయపడనవసరం లేదని తెలియజేయడానికి ఈ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మేళా నిర్వహించిన ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్ చైర్మన్ కోమట్లపల్లి వెంకట సుబ్బారావుని, నెక్ సభ్యులను అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *