ఈ నెల 9న తాడేపల్లిగూడెం లోటస్ హైస్కూల్ లో మెగా జాబ్ మేళా….మెగా మేళాలో పాల్గొననున్న 60 కంపెనీలు…

లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం)  లోటస్ హైస్కూల్లో ఈ నెల 9 సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ దాదాపు 60 కంపెనీలు ఈ జాబ్ మేళాలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తాయని తెలిపారు.
వివిధ బ్యాంకులతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మసీ తదితర సంస్థలలో ఉద్యోగాలకు ఈ జాబ్ మేళా మంచి వేదిక కాగలదన్నారు. 10వ తరగతి పాస్ అయిన వారి నుంచి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఇతర సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారందరూ అర్హులేనన్నారు.
అభ్యర్థుల కోసం నాలుగు బస్సులు ఏర్పాటు చేశామని వివరించారు. విలేకరుల సమావేశంలో వర్తనపల్లి కాశి , గుండుమోగుల సురేష్ , నల్లగంచి రాంబాబు , పైబోయిన వెంకటరామయ్య , మైలవరపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *