రాజకీయ లబ్ధి కోసమే హిందీ భాష పై ,జాతీయ విద్యా విధానంపై విమర్శలు…రాజకీయ గుర్తింపు కోసమే పవన్ పై విమర్శలు – BJP నాయకురాలు  ముళ్ళపూడి రేణుక…

లీడర్ న్యూస్ (తణుకు) త్రిభాషా విధానం హిందీ భాష పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన హిందీ భాషపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో  ప్రముఖ మహిళ రాజకీయవేత్త, బిజెపి నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక స్పందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కొంత మంది రాజకీయ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  త్రిభాషావిధానం, హిందీభాషపై మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని, పాలసీలో ఒక ఇంగ్లీషు, రెండు స్థానిక భాషలు అన్నారు. పవన్ తమ స్థానిక భాషలను నేర్చుకోమన్నారు. బలవంతంగా హిందీభాషను నేర్చుకోమనలేదన్నారు. ఈ విషయంలో సినీనటులు ప్రకాష్ రాజ్, సమాజాన్ని ప్రభావితం చేసే కొంతమంది మాట్లాడుతున్నారుని,అదేవిదంగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు.

తమిళనాడును తీసుకుంటే తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాలు అనేకం ఉన్నాయని, వారు తెలుగుతో పాటు తమిళం నేర్చుకోవచ్చు అంతేకానీ ప్రత్యేకించి హిందీ నేర్చుకోవాలని ఒత్తిడి లేదన్నారు. భారతీయ జనతా పార్టీ బలవంతంగా హిందీని తమ మీద రుద్దుతుందని ప్రజలలో సున్నితమైన అంశాన్ని సమస్యాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తు రాజకీయాలబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో ప్రస్తావించడం జరిగిందని, ఆయన ఏ విషయంలోనైనా రాజకీయ లబ్ధి కోసం గాని, వ్యక్తిగత లబ్ధి కోసం గాని,కాకుండా దేశ హితం రాష్ట్రహితం ప్రజాహితం కోసమే మాట్లాడారని అన్నారు.

ఇటువంటి సున్నితమైన అంశాలలో మాట్లాడినప్పుడు జనసేన పార్టీకి ఇబ్బందికరమని తెలిసినా కూడా మనకు దేశం రాష్ట్రం ప్రాంతం ముఖ్యం అనే భావనతోటే పవన్ మాట్లాడతారని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మాట్లాడుతూ ప్రజలకు ఇష్టమైన భాషను మాట్లాడుకుంటారని, భాషను నిర్ణయించుకునే హక్కు నేర్చుకునే విద్యార్థులకు ఉంటుందని ఆ హక్కును రాష్ట్ర ప్రభుత్వాలు వారికే ఇవ్వాలని చెప్పడం జరిగింది.

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేకపోవడం చేత, రాజకీయ లబ్ధి కోసమే ఉత్తర, దక్షిణ భారతదేశం అనే భావన తీసుకురావడం జరుగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే హిందీ భాష పార్టీ కాదని, ఆ భాషను ఎక్కువమంది మాట్లాడటం చేత, స్థానిక భాషలు కనుమరుగయ్యే ప్రమాదం హిందీ వల్ల ఉంటుందని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

స్థానిక భాషలకు హిందీ నుండి రావటం లేదని, ఇంగ్లీషు భాష నుండి ఆ ప్రమాదం పొంచి ఉందని, ఎక్కువమంది ప్రజలు ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారనీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే హిందీ భాషను, జాతీయ విద్యా విధానాన్ని విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను విమర్శిస్తే తమకు గుర్తింపు లభిస్తుందని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి నాయకురాలు డా. ముళ్ళపూడి రేణుక అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *