సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన రూట్స్ స్కూల్….

లీడర్ న్యూస్ (తణుకు)స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో తణుకు రోటరీ క్లబ్ లో నేటి యువత, వారి తల్లి దండ్రులుకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో వివరించేందుకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్. కె త్రిపాఠి తెలిపారు.సైబర్ క్రేమ్స్ ఎలా జరుగుతున్నాయ్, దానిని ఏ విధంగా నివారించాలి, వాటి నుండి మనం రక్షింపబడాలి అనే అంశాలను వివరించేందుకు ఈ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు చింతలపాటి హరి విచ్చేసి ఈ డిజిటల్ కాలంలో సాంకేతిక ముఖ్యపాత్ర వహిస్తుందని అన్నారు. అలానే రకరకాల చిక్కులు, సమస్యలు కొన్నిసార్లు ఆత్మహత్యకు దారి తీసేలా ఈ సాంకేతికత వికృత రూపం చూపిస్తుందని చాలా అమూల్యమైన, అత్యవసరమైన విషయాలను తల్లిదండ్రులకు అలానే విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె శ్రీనివాసరావు విచ్చేసి రోజుకు కనీసం రెండు సైబర్ నేరాలు, మూడు కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ ఉపయోగించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *