ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

— కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితుడికి పెన్షన్ అందజేత…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ న్యూస్ (తణుకు)ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేసి ఇచ్చిన మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితురాలు పిల్లి సత్యవతి కుటుంబానికి రూ. 10 వేలు పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగులకు అందజేసే పెన్షన్ వారికి చేదుడు వాదోడుగా ఉంటుందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *