లీడర్ న్యూస్ (తణుకు) రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13 నుండి 25 వరకు భారతీయ జనతాపార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది.దీనికి సంబంధించి శనివారం ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు,మహబూబ్ నగర్ ఎం.పి డీకే అరుణ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముళ్ళపూడి రేణుక హాజరైయ్యారు.