కూటమి పార్టీ శ్రేణులతో భాజపా శ్రేణులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి – ఐనంపూడి శ్రీదేవి

లీడర్ న్యూస్ (తణుకు) భాజపా పార్టీ శ్రేణులు కూటమి పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి సూచించారు. తణుకు నియోజకవర్గ స్థాయి భాజపా క్రియాశీలక కార్యకర్తల సమావేశం తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ అల్లూరి సాయిదుర్గ రాజు అధ్యక్షతన, పశ్చిమగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ పర్యవేక్షణ లో, తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ స్థాయి క్రియాశీలక సభ్యులకు పట్టణ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్ స్వాగతం పలికారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం మొదలుపెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షరాలు ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ వికసిత్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు. భాజపా సంస్థాగతంగా బలంగా ఉండడంతో… వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో భాజపా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ అల్లూరి సాయి దుర్గ రాజు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యునిగా ఉన్న ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట త్రిమూర్తులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. ఎల్. కె గుప్తా, పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, బడేటి సాయిరాం, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కామర్స్ ధన కిరణ్మయి, గంటా లక్ష్మి, ఏ. సుజాత, కొడమంచిలి జితేంద్ర,పి. వీరభద్రం, కరాసు శివప్రసాద్, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి మండలాల అధ్యక్షులు, నియోజకవర్గస్థాయి క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *