తణుకులో 10వ తరగతి పరీక్షల్లో అగ్రగామిగా నిలిచిన రూట్స్ విద్యార్థులు…

లీడర్ న్యూస్ (తణుకు) పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగుర వేసారని స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్. కె త్రిపాఠి తెలిపారు. పరీక్షకు హాజరైన 183 విద్యార్థుల్లో 596 మార్కులు సాధించిన విద్యార్థిని యు.హన్సిత పద్మిని తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచింది.మోహన్య 591,నీరజా షైనీ 590 మార్కులు సాధించారు. 580 పైగా 17మంది విద్యార్థులు, 570పైగా 36మంది విద్యార్థులు, 560 పైగా 59మంది విద్యార్థులు, 550 పైగా 69మంది విద్యార్థులు, 500పైగా 123మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు.గణితంలో 100/100 సాధించిన విద్యార్థులు 34మంది, సైన్స్ లో 100/100 సాధించిన విద్యార్థులు 6మంది, తెలుగు మరి సంఘీక శాస్త్రంలో 100/100 సాధించిన విద్యార్థులు నలుగురు, స్కూల్ ఆవరేజ్ 512 సాధించి తణుకు పట్టణంలో అగ్రగామిగా నిలిచింది. ఈ సందర్బంగా పాఠశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపాల్ ఎల్. కె. త్రిపాఠి మాట్లాడుతూ అనుభవం, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం, బట్టి విధానంతో కాకుండా అవగాహన కలిగిన విద్యను అందించడం వలన ఇంతటి ఘన విజయం రూట్స్ కి సాధ్యమైందని తెలిపారు. స్కూల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను పుష్ప గుచ్చంతో సంస్థ డైరెక్టర్స్ సత్కారించారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు సంస్థ డైరెక్టర్స్ ఎల్. కె. త్రిపాఠీ, బి. విద్యాకాంత్, ఎన్. సుధాకర్ వర్మ లు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *