టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ న్యూస్ (విశాఖపట్నం)తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం పరామర్శించారు. ఇటీవల శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం విశాఖపట్నంలోని సీతంపేట శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *