రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఊట గోవిందరాజుకి ఘన సన్మానం…

లీడర్ న్యూస్ (తణుకు)రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం సమావేశాన్ని ఆదివారం విశాఖపట్నంలో అయోధ్య నగర్ లో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సీపానీ వెంకట రమణ, మహిళా అధ్యక్షురాలు సిగరుపల్లి శిరీష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఊట గోవిందరాజు ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గోవిందరాజు మాట్లాడుతూ సంఘ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. సంఘ బలోపేతానికి త్వరలో పశ్చిమగోదావరి జిల్లాలో కూడా సమావేశం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *