ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించిన బీజేపీ నాయకులు…

లీడర్ న్యూస్ (తణుకు) వికసిత భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలైన నేపథ్యంలో తణుకు పట్టణం 13 వవార్డు, ఇరగవరం రోడ్డులో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, బీజేపీ నాయకురాలు ముళ్ళపూడి రేణుక పార్టీ నాయకులు సందర్శించారు. ప్రాథమికంగా అందిస్తున్నటువంటి సేవలుపై హాస్పిటల్స్ సిబ్బందితో చర్చించి, వైద్య సేవలు వినియోగించుకోవడానికి హాస్పటల్ కు వచ్చిన వారిని నేరుగా కలుసుకొని వైద్య సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి సుమారు 5000 మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇప్పటికే మంజూరు అయ్యాయని తెలియజేశారు.అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ  11 సంవత్సరాల సుపరిపాలన గురించి, ఆయన ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవలు గురించి, ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *