లీడర్ న్యూస్ (భీమవరం) భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో దాదాపు 5 వేల మందితో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పశ్చిమగోదావరి జిల్లా “యోగాంధ్ర” కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. యోగాపై ఆసక్తి పెరిగేలా కొనసాగిన ఈ కార్యక్రమంలో అందరితో కలసి యోగాసనాలు చేయడం ఎంతో ఉత్సహన్ని కలిగించిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ , కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు , జిల్లా కలెక్టర్ సి. నాగరాణి , జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి , పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.