లీడర్ న్యూస్ (పెనుగొండ) అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ లింగాల వీధిలో గల రెడ్డి కళ్యాణ మండపం నందు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ సాంప్రదాయం నుండి వచ్చిన గొప్ప వరం యోగా అన్నారు. మనిషి వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆమె తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ కృషితో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ప్రతినిత్యం యోగాను అభ్యసించి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజంలో దేశ ప్రగతి సాధించగలుగుతామని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పి.రామకృష్ణ, మండల ప్రజా అభివృద్ధి అధికారి టి. సూర్యనారాయణ మూర్తి, వాసవి విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ఎన్.పలయ్య, మండల వ్యవసాయ అధికారి పి. స్పందన , చింతాకుల గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాచీన భారతదేశ సాంప్రదాయం నుండి వచ్చిన గొప్ప వరం యోగా….పెనుగొండలో యోగాంధ్ర కార్యక్రమంలో ముళ్ళపూడి రేణుక…
21
Jun