భవిష్యత్తు అవసరాల కోసం మాస్టర్ ప్లాన్ – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (తణుకు) భవిష్యత్తు తరాలకు, అవసరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు.1984లో అప్పటి తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ మాస్టర్ ప్లాన్ తయారుచేసి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా 1990లో మాస్టర్ ప్లాన్ అమలు చేశారని గుర్తు చేశారు. దాని ప్రకారమే తణుకు పట్టణంలో జోన్లు వారీగా అనుమతులు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి భవిష్యత్తులో 85 చదరపు కిలోమీటర్ల వేస్తీర్ణం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీని ప్రకారం తణుకుతో పాటు తణుకు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *