లీడర్ న్యూస్ (తణుకు) తణుకులో అదృశ్యమైన అనంతరం దారుణ హత్యకు గురైన యువకుడి కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాడేపల్లిగూడెం డిఎస్పి విశ్వనాధ్ తెలిపారు. తణుకుకు చెందిన న్యాయవాది తిర్రే సత్యనారాయణ రాజు భార్య శిరీషతో మాడుగుల సురేష్ వివాహేతర సంబంధం కారణంగానే సురేష్ ని తణుకు రప్పించి హత్య చేశారు. శవాన్ని మూట కట్టి సఖినేటిపల్లి సమీపంలో గోదావరిలో పడేశారు. ఈ హత్యలో న్యాయవాదికి ప్రధాన అనుచరులు నలుగురు కనపడకపోవడంతో అసలు విషయం బయట పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో పోలీస్ లు సవాల్ తీసుకొని కేసును చెందిచారు. ముద్దాయిలు తిర్రే సత్యనారాయణ రాజు, వల్లూరి పండు బాబు అలియాస్ పండు, సరెళ్ల సాయి కృష్ణ అలియాస్ సాయి, బంటు ఉదయ్ కిరణ్ అలియాస్ బన్నీ, గంటా ఫణీంద్ర బాబు అలియాస్ ఫణితోపాటు న్యాయవాది భార్య తిర్రే శిరీష అరెస్టు, రిమాండ్ కు తరలించారు.కేసును చేదించడానికి సహకరించిన సిఐలు కొండయ్య, కృష్ణ కుమార్, ఎస్సై ప్రసాద్ తోపాటు సిబ్బందిని డిఎస్పి విశ్వనాధ్ అభినందించారు.
తణుకులో యువకుడి హత్యలో ఆరుగురు అరెస్ట్…
04
Oct