అత్యంత వైభవంగా వాల్మీకి మహర్షి జయంతి & గోదావరి హారతి…

లీడర్ న్యూస్ (తణుకు)లోక కళ్యాణానికై మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జీవిత గాధను ప్రపంచానికి ఆదికావ్యంగా అందించిన ఆదికవి వాల్మీకి మహర్షియని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని గోదావరి పుష్కర రేవు వద్ద ఆశ్వియుజ పూర్ణిమ సందర్భంగా గోదావరి హారతి మరియు వాల్మీకి మహర్షి జయంతి అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా: ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతి మనదని, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం గా భావించడం కోసమే మన పూర్వీకుల నుండి నదీమ తల్లులను ఆరాధించడమనేది సాంప్రదాయంగా మారిందని తెలియజేశారు. ఆనాడు వాల్మీకి మహర్షి జీవితాన్ని మార్చిన రామనామం నేడు దేశ చరిత్రను తిరగరాస్తోందని,మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి పాటించవలసిన ధర్మాన్ని తెలియజేసే రామాయణాన్ని చదవాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *