లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) యాంత్రిక ప్రపంచంలో దైవస్మరణ మరిచి దైనందిన జీవితంలో పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మహానాగు సినిమా ద్వారా దైవ భక్తిని మరోసారి చాటనున్నారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో శ్రీ కృష్ణాశ్రమం మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో మహానాగ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా భగవంతుని ప్రజలందరూ కొలిచే విధంగా మహానాగు సినిమా ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు.
” మహానాగు” సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించిన బొలిశెట్టి శ్రీనివాస్…
08
Oct