కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్…

లీడర్ న్యూస్ (పెంటపాడు) రాజకీయాలను పక్కనపెట్టి కూటమి నాయకులంతా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని శాసనసభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులంతా తనకు సమానమేనని పార్టీలకు అతీతంగా అభివృద్ధిని సాధించడమే తన లక్ష్యమని అన్నారు. వైసిపి ప్రభుత్వం గత ఐదేళ్లుగా అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ప్రజల అనేక అవస్థలు పడ్డారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా వేరే కార్యక్రమాలకు మళ్ళించి వర్గాలకు అన్యాయం చేశారని అన్నారు. సర్పంచులను, ఎంపీటీసీలను నామ మాత్రం చేశారని, ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి కల్పించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించామని అన్నారు. ఎస్. సి. కాలనీలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. పెంటపాడు లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సర్పంచ్ తాడేపల్లి సూర్య కళ, తాడేపల్లి ఈశ్వరరావు, తాడేపల్లి వంశి కుటుంబం 10 లక్షలు విరాళం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ నిర్మాణానికి ఎంపీ నిధులు 25 లక్షలు మంజూరు చేయవలసిందిగా తాను కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్య కళ, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, కసిరెడ్డి మధులత, దత్తు ప్రసాద్, కొనకళ్ళ హరినాథ్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, నల్లమిల్లి గోపిరెడ్డి, పాతూర్ పాతూరి, రాంప్రసాద్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *