లీడర్ న్యూస్ (తణుకు) చేగువేర జీవితం విద్యార్దులకు , యువకులకు స్ఫూర్తి కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ యస్ ఏ)జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు చేగువేరా 58 వ వర్ధంతి సందర్భంగా తణుకులో స్థానిక SCIM ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడలిలో గురువారం చేగువేరా చిత్రపటానికి విద్యార్ధి సంఘం నాయకులు చిలకా నాగరాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టి అప్పలస్వామి , చిలకా నాగరాజులు మాట్లాడుతూ చేగువేరా 1928 లో అర్జన్టేనా లో జూన్ 14 న జన్మించారని అమెరికన్ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి అని వారు తెలిపారు. 1953 లో మెడీషన్ లో డిగ్రీ పట్టా పొందారని వారు అన్నారు. క్యూబాలో బటిష్ఠ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఫెడరల్ కాస్టోని చేగువీర కలుసుకుని వీరిద్దరి నాయకత్వంలో క్యూబా పోరాటం విజయవంతం చేసి క్యూబన్లకు బటిష్ఠ పాలన నుండి విముక్తి కలిగించారని వారు తెలిపారు .అనంతరం కాస్టో ప్రభుత్వం లో చేగువేరా పరిశ్రమల శాఖ మంత్రిగా ,క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షుడుగా అనేక పదవులు చేపట్టారని క్యూబాలో అమెరికా కంపెనీలను జాతీయం చేశారని క్యూబా అక్షరాస్యత 96 శాతం పెంచిన ఘనత చేగువేరాకు దక్కుతుంది వారన్నారు. 1959 లో భారత దేశంలో కూడా చేగువీర పర్యటించి భారత్ కు క్యూబాకు మధ్య సంబంధాలు మెరుగు పరిచారని అనంతరం బొలివియా ప్రభుత్వం అక్కడ పేద ప్రజలను హింసకు గురిచేస్తుంటే బొలివియా ప్రభుత్వం పై చే యుదం ప్రకటించారని ఆ యుధం లో బొలివియా ప్రభుత్వం 1967 అక్టోబర్ 9 న చేగువేరాను హతమార్చిందని వారు తెలిపారు ప్రపంచ దేశాలలో పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ చే ప్రత్యక్షం అయ్యే వారని అలాంటి చేగువేరాను యువత, విద్యార్దులు ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి ప్రేమ్ , వి అభిషేక్ , కే రాజు, జి కార్తీక్ , ఏ వేమన్న , టి అంజలి , జి కీర్తి , కే మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చేగువేర జీవితం విద్యార్దులకు , యువకులకు స్ఫూర్తి కావాలి – ఎఐయస్ఐ
09
Oct