వైసీపీ రాష్ట్రంలో అలజడులు సృష్టించెందుకు కుట్రలు చేస్తుంది – చుక్కా సాయిబాబు

లీడర్ న్యూస్ (తణుకు) చిత్తూరు జిల్లా ఎదురు కుప్పం మండలం దేవులం పేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి నిరసనగా తణుకులో ఎస్సీ సెల్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సాయిబాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టి రాష్ట్రంలో అలజడలను సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు . జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైసీపీ సర్పంచ్ గోవిందయ్యతో పాటు పలువురు పాల్గొని విగ్రహానికి నిప్పంటించారన్నారు . సాక్షాదారులతో సహా బట్టబయలు అయిందని, జగన్ రెడ్డికి వారి అనుచరులకు రాజ్యాంగమన్నా… ప్రజాస్వామ్యం అన్నా విలువలేదన్నారు. టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చదలవాడ నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికార విధానాన్ని చూసి ఓర్వలేక జగన్, వారి అనుచరులు అలజడలు సృష్టిస్తున్నారన్నారు. జగన్ పాలనలో దళితులపై దాడులు హింసలు అవమానాలు ఎక్కువగా జరిగాయని, దళితులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు గమనిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు, అత్తిలి ఇరగవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉప్పల పండు, సాక రామాంజనేయులు దళిత నాయకులు కాకర చిట్టిరాజు ముప్పిడి నరసింహమూర్తి, మొల్లం మైకేల్, చీలి అశోక్ , చింతపర్తి భాస్కరరావు బొంత చిట్టి బాబు, గంటా శ్రీను, ఖండవల్లి జాన్ చదలవాడ అమృత రావు, మెరిపే అమృతరావు, చెట్టే శ్యామ్, చీలి సుదీర్, పండు కిరణ్ రాజేష్, దళితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *