మధ్యతరగతి కుటుంబానికి భరోసా ఎన్.డి.ఏ ప్రభుత్వం – రాష్ట్ర విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 

లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేసి నేటి మధ్యతరగతి కుటుంబానికి భరోసాగా నిలిచారని రాష్ట్ర విప్,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం జీఎస్టీ సంస్కరణలలో భాగంగా మహిళ సాధికారతకు భరోసా ఇవ్వాలనే సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రోజువారి ఉపయోగించే వివిధ రకాల వస్తువులు పై జీఎస్టీ 0% లేదా ఐదు శాతం శాతానికి తగ్గించిన నేపథ్యంలో ( ప్రధానంగా రెండు పన్ను స్లాబ్స్ లతో ) ఆర్టీసీ డిపో, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబానికి ప్రతినెల రెండు నుండి మూడు వేల రూపాయలు ఆదా చేయగలిగిన అవకాశం కల్పించారని ఆయన తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *