జీఎస్టీ 2.0 ఫై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ… 

లీడర్ న్యూస్ (తణుకు)దేశంలో మొట్టమొదటిసారిగా జీఎస్టీ అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ 2.0 కారణంగా మొదటి సంవత్సరంలోనే పన్నులు తగ్గింపులు పైన రూ. 8 వేల కోట్ల వరకు ప్రతిఫలం ప్రజలకు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ఫలాలు అందించే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2017లో అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జీఎస్టీ 1.0 విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా పనులు విధానంలో నాలుగు స్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తిరిగి మరోసారి 2.0 జిఎస్టి ద్వారా దేశంలో ఒక చారిత్రాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారని అన్నారు. నాలుగు స్లాబ్ లో ఉన్న పన్ను విధానాన్ని రెండు స్లాబులకు కుదించారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి కిరాణా వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, చీరలు ఇతర వస్త్రాలు, ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను సరళీకృతం చేశారని చెప్పారు. నిత్యజీవితంలో వినియోగించే మందులతో పాటు జీవిత బీమా సైతం జీరో శాతం జీఎస్టీ అమలు చేయడం అభినందనీయమని అన్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 నుంచి రూ. 15 వేలు వరకు ఆదా అవుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కూటమి నాయకులు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *