రోడ్ల నిర్మాణానికి 1000 విడుదల చేయడం హర్షించదగ్గ విషయం – ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్

లీడర్ న్యూస్ (ఏలూరు) రోడ్ల నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయలుతో నేషనల్ హైవేను అనుసంధానం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు.గత వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని మండిపడ్డారు.ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పిపిపి విదనాన్ని తీసుకొస్తే , వైసిపి పి పి పి విధానం పై దుష్ప్రచారం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.అదేవిధంగా వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలపాటు కల్తీ మద్యం అమ్మిన మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు.తన అనుచరులపై హత్యాయత్నం జరగడం వాస్తవమేనని, భీమవరం నుంచి మనుషుల్ని తీసుకొచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *