లీడర్ న్యూస్ (తణుకు) దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన బొమ్మనబోయిన శ్రీ ఆంజనేయులు మొదటి కుమారుడు జోగేంద్ర నందు (13) కాలువలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు… కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం తణుకులో ఒక పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్న ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు.. ఉద్యోగం రీత్యా తణుకు బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు మొదటి కుమారుడు జోగేంద్ర నందు (13) 8వ తరగతి చదువుతున్నాడు. కుటుంబం తణుకు బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్నారు. గతంలో తణుకు పైడిపర్రులో ఆంజనేయులు కుటుంబం నివాసం ఉంది.. ఆదివారం కావడం తో పైడిపర్రు ప్రాంతంలో కూడా జోగేంద్ర నందకి పాత స్నేహితులు ఉండటంతో పైడిపర్రు వంతెన వద్ద ఉన్న కాలువ రేవులో స్నానానికి దిగాడు..ఆ సమయంలో సుమారు 10మంది వరకూ కుర్రాళ్ళు స్నానం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జోగేంద్ర నందు కొట్టుకుపోవడం చూసిన కుర్రాళ్ళు స్థానికులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తణుకు రూరల్ ఎసై చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.