జలజీవన్ మిషన్ పనులు తక్షణం పున: ప్రారంభించాలి – సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు….

లీడర్ న్యూస్ (తణుకు) వేల్పూరు గ్రామంలో అసంపూర్ణంగా నిలిచిపోయిన జలజీవన్ మిషన్ పనులు తక్షణం పున: ప్రారంభించాలని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాలిపేట 10వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజల వద్ద నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 – 50 నిధులు కేటాయింపులుతో రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం జల జీవన మిషన్ పనులు ప్రారంభించి మూడు సంవత్సరాలు సమయం కావస్తున్నప్పటికీ నేటికీ పనులు పూర్తి చెయ్యకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పనులు పున: ప్రారంభించాలని….మా వీధిలో మా ఇంటికి కుళాయి కనెక్షన్ ఎప్పుడు వస్తుందోనని ప్రజలు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారని వీరభద్రరావు చెప్పారు.అయితే పనులు పూర్తి కాకుండా ఎందుకు నిలిచిపోయాయో?అందుకు బాధ్యులు ఎవరో సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం కూడా చెప్పాలని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 10వవార్డు శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వర్రావు,తాళ్ళ సత్యనారాయణ, విశ్వనాథం సుబ్బారావు,అయిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *