లీడర్ న్యూస్ (నరసాపురం) జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి కొప్పర్రు గ్రామానికి చెందిన 200మంది పార్టీలో చేరినట్లు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఈ సందర్బంగా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో కొప్పరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు పోలిశెట్టి శేషు పోలిశెట్టి మధు చిన్నమిల్లి బాబులు అందే కవి ల ఆధ్వర్యంలో యాదంరెడ్డి సూరిబాబు, అందే భాస్కరరావు, కడలి ఏసుబాబు, గుబ్బల ఏడుకొండలు, కడలి ముత్యం జాయుడు , పీతల శాంసన్ సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు జనసేన పార్టీలోకి చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్నా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతా
లు నచ్చి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.