ఈనెల 18న తణుకులో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం…తణుకు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి… – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు…

లీడర్ న్యూస్ (తణుకు)ఈనెల 18న తణుకులో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తన ఆధ్వర్యంలో తణుకులోని వేల్పూరు రోడ్డులోని వీకే కన్వెన్షన్‌ హాలులో ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఈ శిబిరం ప్రారంభిస్తారని చెప్పారు. ఈ శిబిరానికి జిల్లా ఆరోగ్య సొసైటీ, నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్‌ లయన్స్‌ నేత్ర వైద్యశాల, అలంపురం వెంకటరమణ సేవా ఛారిటబుల్‌ ట్రస్టు సహకారం అందిస్తారని తెలిపారు. సుమారు 1000 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తణుకు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు 88864 11888, 97016 02954 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *