లీడర్ న్యూస్ (తణుకు)కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇకపై రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు రానున్నాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కర్నూలులో గురువారం ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్, బచత్ ఉత్సవ్ బహిరంగ సభ విజయవంతం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశప్రగతి వేగాన్ని పెంచడంలో ప్రధానమంత్రి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తున్న నరేంద్రమోదీ ఒక విశిష్ట నేత అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్రమంత్రి నారా లోకేష్లతోపాటు దేశ ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రం మరింత ప్రగతి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలకు తోడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు…మోదీ సభ విజయవంతంపై తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ హర్షం…
17
Oct