లీడర్ న్యూస్ (తణుకు)తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ కాంటాక్ట్ పారిశుధ్య కార్మికులు తమ మూడు నెలల వేతనబాకాయిలు చెల్లించాలని, 41 నెలల పిఎఫ్ బాకాయి సొమ్ము కార్మికుల పిఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని,తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయి కనుగుణంగా కనీసం మరో 50 మంది పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరుతూ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.
అధికారులు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయకుండా మున్సిపల్ వర్కర్స్ తో హాస్పిటల్ పారిశుధ్య పనులు నిర్వర్తింపచేయడం దురదృష్టకరమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు.41 నెలలుగా కార్మికుల పి.ఎఫ్ సొమ్ము కట్టకుండా కార్మికుల సొమ్ము దోచుకుంటున్న ఫస్ట్ ఆబ్జెక్ట్ కాంట్రాక్టరుకు వైద్య,ఆరోగ్య శాఖాధికారుల బిల్లులు ఎలా మంజూరు చేశారని భీమారావు ప్రశ్నించారు.
వందల కోట్ల రూపాయల పి. ఎఫ్ సొమ్ము అవినీతి జరిగిందని మొత్తుకుంటున్న సదరు కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోరని కార్మికులకు ఎందుకు న్యాయం చేయరని భీమారావు ప్రశ్నించారు.కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ నిరసన తెలిపేందుకు కార్మికులు సమ్మెకు పూనుకున్నారన్నారు.ప్రభుత్వం కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే భవిష్యత్ లో జిల్లా వ్యాపితంగా నిరవధిక సమ్మెకు వెనుకాడబోరని హెచ్చరించారు.తదనంతర పరిమణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించ వలసివుంటుందన్నారు.
సమ్మెకు ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్మాని పుష్పలత, ఎం. బేబి, భారతి, వెంకటలక్ష్మి ప్రసన్న, హైమావతి,డి. శ్రీనివాస్, చింతాలు, పి.రామారావు, సీహెచ్ మంగమ్మ, పి. విజయలక్ష్మి, రేణుక, వి. సూరమ్మ తదితరులు నాయకత్వం వహించారు.