లీడర్ న్యూస్ (తణుకు)విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు చిరస్మరణీయులని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తణుకు సర్కిల్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తొలుత తణుకులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేంద్ర సెంటర్‌లో సంస్మరణ స్థూపం వద్ద విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ కొండయ్య మాట్లాడుతూ దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు చిరస్మరణీయులన్నారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ప్రతిఒక్కరు స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ ఎస్సై కె.ప్రసాద్, ఇరగవరం ఎస్సై జానా సతీష్, ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, ఏఎస్సైలు సత్యనారాయణ, శ్రీధర్, రాజ్యలక్ష్మి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం – తణుకు పట్టణ సీఐ కొండయ్య
21
Oct