లీడర్ న్యూస్ (తణుకు)ముంథ తుఫాను ప్రభావంతో భారీ స్థాయిలో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో తణుకు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. సోమవారం తణుకులో మీడియాతో మాట్లాడారు. మంగళ, బుధవారాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున తణుకులో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో విద్యుత్తు, నీటి సరఫరా, టెలి కమ్యూనికేషన్ ఆటంకాలు లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఇప్పటికే తణుకు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.
తుఫాను ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
28
Oct