లీడర్ న్యూస్ (తణుకు) మొంథా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తణుకు జడ్పీ హై స్కూల్ లో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అనంతరం వారిని పరామర్శించి వారికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారని చెప్పారు. తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉంటూ వారి ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తున్నారని చెప్పారు. అనంతరం పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. వారికి అందుతున్న ఆహారం, వసతి సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు, తాసిల్దారులతో మాట్లాడారు.
తణుకులో 250 మంది బాధితులకు పునరావాసం… అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ……
29
Oct