లీడర్ న్యూస్(తణుకు) కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజవర్గంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా జరుగుతోందని తణుకు, అత్తిలి ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, దాసం ప్రసాద్ పేర్కొన్నారు. ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంతోమంది ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు నియోజకవర్గంలో 68 మందికి రూ. 29.61 లక్షలు చెక్కులు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. గురువారం కూటమి కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్ర చికిత్సలకు సంబంధించి ఖర్చు చేసిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల్లో 98 శాతం లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు. పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అర్హత కలిగి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లబ్ధి పొందలేని వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి, సంక్షేమం….* తణుకులో 68 మందికి రూ. 29.61 లక్షల మేర చెక్కులు అందజేత…
30
Oct