లీడర్ న్యూస్ (తణుకు)అధికారులు, కూటమి నాయకుల సమన్వయంతో కొంత తుఫాను ప్రభావాన్ని తణుకు నియోజవర్గంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకు పట్టణంలోని తుఫాను ప్రభావానికి గురైన బాధితులకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడారు. తుఫాను హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారని అన్నారు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఎదురైన సమయంలో చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో కూటమి నాయకులు, అధికారులు సైతం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సైతం వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయిన తక్షణమే వాటిని పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి చిరు సత్కారం చేసి అభినందించిన ఆరిమిల్లి రాధాకృష్ణ . తణుకు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో ప్రాథమిక అంచనా ప్రకారం 4 వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందని అధికారులు నివేదికలు ఇచ్చారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు.
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… *అధికారులకు చిరు సత్కారం…*తుఫాను బాధితులకు నిత్యవసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ….
03
Nov