లీడర్ న్యూస్ (తణుకు) విశాఖపట్నంలో దొరికిన 1లక్ష 89 వేల కేజీలు గోమాంసానికి మూలాలు తణుకు లెహ్యం పుడ్ ప్రోడక్ట్ నుండి ఉన్నాయని సాక్షాత్తు కేంద్రం నుండి అక్కడికి తనికీలు చేయడానికి వచ్చిన అధికారులు బట్ట బయలు చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు తెలిపారు.
ఈ మేరకు తణుకు వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పురాణాల్లో కూడా గోహత్య మహా పాపం అని చెబితే ఇక్కడ ఎమ్మెల్యేకి మాత్రం అర్ధం కావడం లేదా అని ప్రశ్నించారు. ఆ పరిశ్రమ వలన చుట్టు ప్రక్కల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోకొంటున్నారన్నారు.తణుకులో ఎంతో మంది కవులు, రచయితలు పుట్టిన ప్రాంతంలో అటువంటి పరిశ్రమ నడపటం దారుణం అని మండిపడ్డారు. పరిశ్రమ చుట్టు పక్కల దాదాపుగా నీరు కలుషితం అయిపోయిందన్నారు.పశువధ పరిశ్రమ మూసేవరకూ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.గోవధ పరిశ్రమ మూసివేయాలంటూ తమ సమస్య సాక్షాతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బస్సు వేసుకొని వెళ్లి చెప్పినా ప్రయోజనం లేదన్నారు.కోర్టులో పోరాటం చేస్తున్నాను. కోర్టు బెంచ్ మీదకు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ రాజు పరిధిలో ఉన్న ఈ పరిశ్రమపై చర్యలు తీసుకోండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నా అని పేర్కొన్నారు. పశువధ పరిశ్రమ వ్యర్ధాలు కూడా ఇక్కడే పడేస్తున్నారు. దీని వలన ప్రజలు ఆరోగ్యం చెడిపోతుందన్నారు. ఎమ్మెల్యే కి పావలా వాటా ఉందని ఆరోపించారు. పోలీస్ లు కూడా ఈ పరిశ్రమకు సహకారం చేస్తున్నారని విమర్శించారు.