కారుమూరి… డైవర్షన్ పాలిటిక్స్ మానుకో – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (తణుకు)మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హితవు పలికారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన నాగ హారిక కేసు విషయంలో సమాధానం చెప్పలేని కారుమూరి ఇప్పుడు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 2022 నవంబర్ 12న హత్యకు గురైన నాగ హారిక కేసు విషయంలో అప్పటి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతోనే కేసును పక్కదో పట్టించాలని గుర్తు చేశారు. మృతురాలు నాగ హారిక తండ్రి ముళ్ళపూడి శ్రీను సవతి తల్లి ముళ్ళపూడి రూప కలిసి హత్య చేశారని ఆరోపణలు వెలువెత్తినప్పటికీ అప్పటి మంత్రిగా ఉన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కేసును పక్కదో పట్టించారని చెప్పారు కేవలం. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న రూప అప్పట్లో వైసిపి తణుకు మండలం మహిళా అధ్యక్షురాలుగా ఉండడంతోనే అప్పట్లో నాగ హారిక కు అన్యాయం చేసారని చెప్పారు. ఈ కేసులో అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పోలీసులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని మృతురాలి మేనమామ, అమ్మమ్మ, తాతయ్యలు ఆరోపిస్తున్నారని చెప్పారు. అప్పట్లోనే పోస్టుమార్టం రిపోర్టులో తలభాగం పగిలి పెట్రోలు పోసి నిప్పు అంటించారని నివేదిక వచ్చినప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్ళతో పోలీసులు బయట పెట్టలేదని చెప్పారు. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్న మాజీ మంత్రి కారుమూరి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ కర్మగారంపై ఉద్యమం చేస్తానంటూ ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. నాగ హారిక కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత హైదరాబాదు పారిపోయిన మాజీ మంత్రి కారుమూరి తన జేబు సంస్థలైన మీడియా ప్రతినిధులను లేహం ఫుడ్స్ కర్మాగారం వద్దకు పంపించి హత్య కేసును పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు స్థానికులను తీసుకువచ్చి మీ వెంట నేనున్నానంటూ ఉద్యమం చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. లేహం ఫుడ్స్ కర్మాగారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ అంశంలో వారికి ఎప్పుడూ తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఇప్పటికైనా మాజీ మంత్రి కారుమూరి స్పందించి నాగ హారిక మేనమామ, అమ్మమ్మ, తాతయ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విశాఖ సమ్మిట్ విజయవంతం…

విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం అయిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన వల్ల రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంతో వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారనే దానికి సిఐఐ భాగస్వామ్య సదస్సు నిరూపించిందని చెప్పారు. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాకుండా రాష్ట్రంపై పెట్టుబడిదారుల దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని అన్నారు. ఈ సదస్సులో మొత్తం 613 ఒప్పందాల ద్వారా రూ. 13.65 లక్షల కోట్లు పెట్టుబడులు తద్వారా 16 లక్షల ఉద్యోగాలు రావడానికి కారణం అవుతోందని చెప్పారు. తొలిరోజు ఒక్కరోజే రూ. 8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను వాటి ద్వారా 12 లక్షల ఉద్యోగాలు నమోదు కావడం ఏపీ అభివృద్ధికి గట్టి బలంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *