లీడర్ న్యూస్ (తణుకు)గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేపట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గతంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాలకులు సైతం తిరుపతి లడ్డూను పూర్తిగా కల్తీమయం చేశారని విమర్శించారు. అత్తిలి మండలం బల్లిపాడు మదనగోపాల స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతి లడ్డూలో రసాయనాలు వినియోగించి కల్తీ నెయ్యి వాడారని నిర్థారణ అయ్యిందని చెప్పారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన అందించిన వైసీపీ నాయకులు, అప్పటి అధికారులు సైతం పరకాణిలో డబ్బులు సైతం నొక్కేశారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. హిందూ దేవాలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల వారి విశ్వాసాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో 11 దేవాలయాలకు సంబంధించి పాలకవర్గాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మదన గోపాలస్వామి ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షులు గారపాటి వెంకటసుబ్బారావు (బాబ్జి)తోపాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అబినంధించారు. అంతకుముందు అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూ సంప్రదాయాలని అపహాస్యం చేసిన వైసీపీ…*తిరుపతి లడ్డూను సైతం కల్తీ చేసిన వైసీపీ నేతలు… *తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు…
20
Nov