లీడర్ న్యూస్ (హైదరాబాద్) జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాల నాయకులతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధం కావాలని కోరారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వం నుండి ప్రజలకు అందాల్సిన పథకాలపై ప్రజల పక్షాన నిలబడుతూ అందర్నీ కలుపుకొని పార్టీని విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల పక్షాన నిలబడాలని నాయకులకి పిలుపునిచ్చారు. నాయకులు అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో కూకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, ఖమ్మం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు, వీర మహిళల విభాగం చైర్మన్ శ్రీమతి మండపాక కావ్య గారు పాల్గొన్నారు.